Monday, October 12, 2015

వివేకానంద ఆవాసాన్ని అభివృద్ధి చేద్దాం

భైంసారూరల్ : పట్టణంలోని వివేకానంద ఆవాసాన్ని మరింత అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక నర్సింహా కల్యాణ మండపంలో వివేకానంద ఆవాస 19వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అథితిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు. 19 ఏళ్ల క్రితం పట్టణంలోని ఓ చిన్న గదిలో ప్రారంభమైన ఈ ఆవాసం, అనాథ విద్యార్థులకు ఎంతో చేయూతనందిస్తున్నదని కొనియాడారు. ఆవాస అభివృద్ధికి కృషి చేసిన దాతలకు అభినందనలు తెలిపారు. ఆవాసానికి రోడ్డు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని నిర్వాహకులు ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఆయన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆవాసంలో త్వరలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. కుభీర్ మండలం సౌనా గ్రామానికి చెందిన బాపురావ్ పటేల్ ఆవాసానికి 3.5 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు.

ఎవరైనా విరాళాలు అందజేయాలనుకేంటే ని ర్వాహకులను సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. గణేశ్ మహరాజ్, సేవా భారతి ప్రాంత ఉపాధ్యక్షుడు డా. హెచ్‌కే నాగు, వ్యాపారులు దిగంబర్ మాశేట్టివార్, గంగారెడ్డి, తహసీల్దార్ రాంమోహన్, ఆవాస అధ్యక్షుడు సక్కెర భాస్కర్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘ చాలక్ నూకల విజయ్ కుమార్, నాగమణి లింగన్న, నూకల సురేశ్, ఆవాస నిర్వహకులు పాల్గొన్నారు.

Source: http://www.namasthetelangaana.com/

No comments:

Post a Comment